
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు మరింత పెరిగాయి. క్యూ1లో రూ. 235 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నష్టాలు రూ. 137 కోట్లు. ఆదాయం రూ. 2,573 కోట్ల నుంచి రూ. 1,648 కోట్లకు క్షీణించింది. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం ఆదాయం రూ. 1,893 కోట్ల నుంచి రూ. 1,247 కోట్లకు, విద్యుత్ వ్యాపార విభాగం రూ. 375 కోట్ల నుంచి రూ. 73 కోట్లకు తగ్గింది.
అటు ఈపీసీ విభాగం ఆదాయం రూ. 223 కోట్ల నుంచి రూ. 230 కోట్లకు, రహదారుల వ్యాపార విభాగం ఆదాయం రూ. 142 కోట్ల నుంచి రూ. 145 కోట్లకు పెరిగింది. షేర్ల జారీ లేదా ఈక్విటీ ఆధారిత సాధనాలు, ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 2,950 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment