సాక్షి, చెన్నై: హఠాత్తుగా బంగారం ధరకు గురువారం రెక్కలు వచ్చాయి. సవరం బంగారానికి ఒక్క రోజు రూ. 512 పెరిగింది. కొన్ని నెలల అనంతరం ప్రస్తుతం సవరం బంగారం రూ. 25 వేలు దాటింది. గత ఏడాది బంగారం ధరం అమాంతంగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. తదుపరి క్రమంగా తగ్గుతూ, అప్పుడప్పుడు పెరుగుతూ వచ్చింది. అయితే, ధర పెరుగదల తగ్గుదల వ్యతాసం తక్కువే. దీంతో బంగారం కొనుగోలుపై పెద్ద సంఖ్యలో జనం దృష్టి పెట్టారు.
ఈ పరిస్థితుల్లో గురువారం హఠాత్తుగా ఒక్క రోజులో బంగారం ధర అమాంతంగా పెరి గింది. బుధవారం ఒక గ్రాము రూ.3,147 ఉంది. అలాగే, సవరం ధర రూ. 25 వేల 176కు చేరింది. అయితే, గురువారం ఈ ధర మరింతగా పెరిగింది. ఒక గ్రాము ధర రూ. 3,211గాను, సవరం ధర రూ. 25,688గాను విక్రయించారు. ఇక సాయంత్రానికి ఈ ధరలో మరింత పెరుగుల కనిపించడం గమనార్హం. ఈ ఒక్క రోజు సవరం బంగారానికి రూ. ఐదు వందల నుంచి రూ. ఆరు వందల వరకు పెరగడం కొనుగోలు దారులకు షాక్ తగిలినట్టు అయింది. ఈ పెరుగుదల గురిం చి బంగారు వర్తక సంఘం పేర్కొంటూ, మరో రెండు మూడు రోజులు ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment