
బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి
ముంబై : ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడం, లాక్‌డౌన్ సడలింపులతో పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా ప్రారంభమవుతుండటం బంగారం ధరలపై ప్రభావం చూపాయి. ముంబై ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం రూ 100 దిగివచ్చి రూ 45,650 పలికింది. బంగారం ధరలు మరికొద్ది రోజులు అనిశ్చితితో సాగినా నిలకడగా పెరుగుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా అమెరికా-చైనా ట్రేడ్‌వార్, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో రాబోయే రోజుల్లో పసిడికి పెట్టుబడి డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. బంగారం ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేస్తూ పోవాలని మదుపుదారులకు నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో పసిడిపై పెట్టుబడులు మెరుగైన రాబడి ఇస్తాయని చెబుతున్నారు.