మాకు 100 మంది పిల్లలు కావాలి : గూగుల్‌ | Google Wants 100 Indian Kids To Spend Summer Days In Its Offices | Sakshi
Sakshi News home page

మాకు 100 మంది పిల్లలు కావాలి : గూగుల్‌

Published Tue, May 29 2018 9:30 AM | Last Updated on Tue, May 29 2018 9:33 AM

Google Wants 100 Indian Kids To Spend Summer Days In Its Offices - Sakshi

గూగుల్‌ ఆఫీసు (ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌ : పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయంటే.. తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిందే. తెగ అల్లరి చేసేస్తూ ఇల్లుపీకి పందిరేస్తారు. ఈ అల్లరి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది పెద్దలు పిల్లల్ని ఈ సెలవుల్లో అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఇళ్లకు పంపించడ​... లేదా సమ్మర్‌ క్యాంప్స్‌కు పంపించడం చేస్తుంటారు. ఇటీవల అయితే తల్లిదండ్రులు ఎక్కువగా వేసవి శిబిరాలకే మొగ్గుచూపుతున్నారు. ఒకే సమయంలో అటు ఆటలు, ఇటు విజ్ఞానాన్ని అందించే ఈ వేసవి శిబిరాలు ప్రస్తుతం పిల్లలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రపంచంలో అతిపెద్ద టెక్‌ దిగ్గజమైన గూగుల్‌ సైతం పిల్లల్ని ఆహ్వానిస్తోంది. తమ హైదరాబాద్‌, గుర్గావ్‌ ఆఫీసులకు 100 స్కూల్‌ పిల్లలకు కావాలంటూ గూగుల్‌ ప్రకటించేసింది. పిల్లల తల్లిదండ్రులకు ఒక ఓపెన్‌ లెటర్‌ రాసింది. 

ఈ లేఖలో‘ మిమ్మల్ని మా కంపెనీకి తీసుకురావడానికి మా ప్రొడక్ట్‌ లీడర్లతో మేము భాగస్వామ్యం ఏర్పరచుకున్నాం. పిల్లలతో పాటు కలిసి పలు యాక్టివిటీస్‌ మీరు పాల్గొనవచ్చు. నాలుగు వారాలు ముగిసే వరకు #సమ్మర్‌విత్‌గూగుల్‌ మీకు ఒక మంచి జ్ఞాపకంగా మరలుస్తాం. గూగుల్‌ గుర్గావ్‌, హైదరాబాద్‌  క్యాంప్స్‌లో విద్యార్థులను ఉల్లాసభరించేలా సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తాం. 100 మంది పిల్లలతో పాటు వారి గార్డియన్లు దేశమంతటా విమానంలో చుట్టి వచ్చేయొచ్చు. ఈ సమ్మర్‌ క్యాంప్‌ను అసలు చేజార్చుకోకూడదు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన నాలుగు సులభమైన పద్ధతుల్లో మీరు, మీ పిల్లలు ఈ సమ్మర్‌ క్యాంప్‌లో భాగస్వామ్యం అవండి’ అని గూగుల్‌ పేర్కొంది. 

గూగుల్‌ సమ్మర్‌ క్యాంప్స్‌ కోసం నిర్వహించాల్సి పద్ధతులు...

  • గూగుల్‌ వెబ్‌సైట్‌లో ప్రతీవారం సమ్మర్‌ క్యాంప్‌కు అనే దానిలోకి వెళ్లాలి
  • తాజా సవాల్‌ను స్వీకరించి, పూర్తి చేయాలి
  • దానిలో మొదటి సవాల్‌, గూగుల్‌ ఎర్త్‌ వాడకానికి సంబంధించి ఉంటుంది. ఇది ఇ‍ప్పటికే అందుబాటులో ఉంది.
  • తర్వాతది గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌, వేరొక భాషలో ఓ కొత్త పదాన్ని నేర్చుకోవాలి
  • గూగుల్‌ ఆర్ట్స్‌, కల్చర్‌ కార్యక్రమానికి సంబంధించి మరో సవాల్‌ ఉంటుంది. 
  • గూగుల్‌ అందించే టూల్స్‌ వాడుతూ యాప్‌ను సృష్టించాలి. ఇదే చివరి ఛాలెంజ్‌.

ఈ ఛాలెంజ్‌లన్నీ అయిపోయాక, గూగుల్‌ దేశవ్యాప్తంగా 100 మంది విద్యార్థులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారిని ఆఫీసులకు పిలుస్తుంది. ఇలా వచ్చిన విద్యార్థులకు గూగుల్‌ ఎలా పనిచేస్తుంది. ఎలా ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఆలోచిస్తాడు వంటి విషయాలపై అవగాహన పొందుతారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలు ఎక్కువ గంటలు ఇంటర్నెట్‌పై గడుపుతున్నారని బాధపడే తల్లిదండ్రులకు ఇది నిజంగా శుభవార్తేనని తెలుస్తోంది. పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుని, అన్నీ నేర్పిస్తూ కొత్త కొత్త విషయాలు కొనుగొనేందుకు ప్రోత్సహిస్తామని గూగుల్‌ సైతం చెప్పింది.. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement