హడ్కో వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం | Government invites merchant bankers for Hudco stake sale | Sakshi
Sakshi News home page

హడ్కో వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం

Published Wed, Jul 13 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

హడ్కో వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం

హడ్కో వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం

న్యూఢిల్లీ : హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో) డిజిన్వెస్ట్‌మెంట్ కోసం మర్చంట్ బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం 100 శాతంగా ఉన్న తన వాటా నుంచి 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐపీఓద్వారా వాటాను విక్రయించాలని యోచిస్తున్న కేంద్రం.. ఈ ప్రక్రియకు తగిన సలహా, సహా యకారాలు అందించేందుకు మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులకు వచ్చే నెల 3 వరకు గడువు ఇచ్చింది. ఈ ఐపీఓ ద్వారా జారీ అయ్యే షేర్లకు రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఈ  ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement