న్యూఢిల్లీ: ఇండిపెండెంట్ డైరెక్టర్ల వివరాలతో కూడిన సమగ్రమైన ‘డేటా బ్యాంక్’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ డేటా బ్యాంక్‌లో ప్రస్తుతమున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల వివరాలతో పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్లయ్యే అర్హత గల వారి వివరాలను కూడా పొందుపరుస్తారు. కంపెనీలు ఏవైనా ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించుకోవాలనుకుంటే ఈ డేటా బ్యాంక్ వాటికి ఉపయోగపడుతుంది. ఈ డేటా బ్యాంక్ పోర్టల్‌ను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండి యన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) నిర్వహిస్తుంది. 2013 నాటి కంపెనీల చట్టం ప్రకారం ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఈ నెల 1 నుంచి 3 నెలలలోపు తమ వివరాలను ఈ డేటాబ్యాంక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, 2020 మార్చి నుంచి అందుబాటులోకి వచ్చే ఆన్‌లైన్ ప్రొఫిషియెన్సీ సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment