భారత్లో హిటాచి ఏటీఎమ్ ల తయారీ కంపెనీ
రూ.100 కోట్లతో బెంగళూరులో ఏర్పాటు
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హిటాచి గ్రూప్ భారత్‌లో ఏటీఎమ్‌లు తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో హిటాచి టెర్మినల్ సొల్యూషన్స్ ఇండియా పేరుతో రూ. 100 కోట్లతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలో బ్యాంక్ ఖాతాదారులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హిటాచి గ్రూప్‌కు చెందిన హిటాచి-ఓమ్రన్ టెర్మినల్ సొల్యూషన్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈఏడాది జూన్‌లో ఏటీఎమ్‌ల తయారీని ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరికల్లా నెలకు 1,500 ఏటీఎమ్‌లను ఉత్పత్తి చేయగలమని హిటాచి కంపెనీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఈ ఏటీఎమ్‌ల తయారీ కంపెనీని ఆరంభిస్తున్నామని, ఉద్యోగ కల్పనకు, భారత ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామని వివరించింది. 2015 కల్లా 5,000 ఏటీఎమ్‌లను భారత్‌లో ఏర్పాటు చేశామని, పేర్కొంది. కాగా భారత్‌లో ప్రస్తుతం రెండు లక్షల ఏటీఎమ్‌లు, సీడీ(క్యాష్ డిస్పెన్సింగ్ ఏటీఎమ్)లు ఉన్నాయి.