న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్‌లో హైరింగ్ కార్యకలాపాలు హైదరాబాద్‌లో 15 శాతం వృద్ధి చెందాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. దేశవ్యాప్తంగా హైరింగ్ 25 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. దీంతో కొత్త ఏడాదిలో హైరింగ్ జోరుగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, టెలికాం, ప్రకటనల, మీడియా రంగాల్లో హైరింగ్ జోరుగా ఉంది.