పీఎఫ్‌సీ... వడ్డీ ఆదాయం జోష్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.1,713 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1 నికర లాభం(రూ.1,576 కోట్లు)తో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని పవర్ ఫైనాన్స్ కార్పొ తెలిపింది. అధిక వడీ ఆదాయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని పేర్కొంది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.7,106 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ1లో రూ.6,709 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో రూ.7,072 కోట్లకు పెరిగిందని పేర్కొంది.