ఐక్యరాజ్య సమితి : డిమానిటైజేషన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని విపక్షంతో పాటూ స్వపక్షం నుంచి వినిపిస్తున్న విమర్శల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాని మోదీకి తీపి కబురు చెప్పింది. పెద్దనోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించిన మాట వాస్తవమే అయినా.. భవిష్యత్‌లో మాత్రం పరుగులు తీయం తథ్యమని ఐక్యరాజ్య సమితి తెలిపింది. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు వేగం పుంజుకుంటుందని సమితి అంచనా వేసింది. 2018లో వృద్ధిరేటు 7.2గా, 2019లో 7.4 వృద్ధిరేటను భారత ఆర్థిక వ్యవస్థ నమోదు చేస్తుందనే అంచనాలను సమితి వరల్డ్ ఎకనమిక్ సిట్యుయేషన్-2018 తెలిపింది. 2018 తరువాత భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంటుందని అంచనా వేసింది.
పెద్దనోట్ల రద్దు చర్య వల్ల భారత్‌లో వృద్ధిరేటు మందగించిన మాట వాస్తవమని వరల్డ్ ఎకనమిక్ సిట్యుయేషన్ -2018 నివేదిక స్పష్టం చేసింది. అయితే పెద్దనోట్ల రద్దు తరువాత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా.. వృద్ధి రేటు వచ్చే ఏడాది నుంచి గణనీయంగా పెరిగే అవకాశముందని నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని నివేదిక అంచనా వేసింది. అదే సమయంలో 2019లో 7.9 శాతం వృద్ధిరేటును భారత్ నమోదు చేసే అవకాశాలున్నాయని కూడా తెలిపింది.
చైనా వృద్ధిరేటు 6.8గా ఉంది. ఇది భారత్ కన్నా కొంచెం ఎక్కువే. అయితే.. 2018, 2019 సంవత్సరాల్లో.. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటను చైనా అందుకోలేదని సమితి నివేదిక అంచనావేసింది. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు ఎమర్జింగ్ ఎకానమీస్‌గా మారుతున్నాయని సర్వే ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment