న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లాభం మార్చి త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.117 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,097 కోట్లతో పోలిస్తే, 35 శాతం వృద్ధి తో రూ.8,260 కోట్లుగా నమోదైంది. ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇండిగో లాభం అతి తక్కువగా రూ.156 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2017–18లో వచ్చిన లాభం రూ.2,242 కోట్లతో పోలిస్తే 93 శాతం తగ్గిపోయింది. దేశీయంగా విమానయాన పరిశ్రమకు 2018–19 చాలా కఠినమైన కాలంగా ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా పేర్కొన్నారు. అధిక ఇందన ధరలు, బలహీన రూపాయికి తోడు, తీవ్రమైన పోటీ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు చెప్పారు. మొదటి ఆరు నెలలు నష్టాలను ఎదుర్కోగా, తదుపరి ఆరు నెలలు రికవరీ చేసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తు విషయంలో బుల్లిష్‌గానే ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment