Quarterly earnings
-
త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలు
అదానీ ఎనర్జీ లాభం దూకుడున్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ ప్రసార దిగ్గజం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 80 శాతం దూసుకెళ్లి రూ. 625 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 348 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,824 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లకు ఎగసింది. విద్యుత్ ప్రసార విభాగంలో రూ. 54,761 కోట్ల భారీ ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ సీఈవో కందర్ప్ పటేల్ పేర్కొన్నారు. స్మార్ట్ మీటరింగ్‌లో రూ. 13,600 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించారు. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 805 వద్ద ముగిసింది.జీల్ లాభం హైజంప్న్యూఢిల్లీ: మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా దూసుకెళ్లి దాదాపు రూ. 164 కోట్లకు చేరింది. ప్రధానంగా నిర్వహణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 59 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,027 కోట్ల నుంచి రూ. 941 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,931 కోట్ల నుంచి రూ. 1,735 కోట్లకు తగ్గాయి. వీటిలో నిర్వహణ వ్యయాలు రూ. 1,188 కోట్ల నుంచి రూ. 997 కోట్లకు వెనకడుగు వేశాయి.సైయంట్ లాభం రూ.122 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ సైయంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 122 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ3లో ఇది రూ. 147 కోట్లుగా నమోదైంది. మరోవైపు, ఆదాయం రూ. 1,821 కోట్ల నుంచి రూ. 1,926 కోట్లకు చేరింది. కీలకమైన డీఈటీ (డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ) విభాగం ఆదాయం స్వల్పంగా 0.8 శాతం క్షీణించి రూ. 1,480 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. ఈడీ, సీఈవోగా కార్తికేయన్ నటరాజన్ తప్పుకున్నట్లు పేర్కొంది. పవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యమైన విడిభాగాల అభివృద్ధిలో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?హెచ్‌పీసీఎల్ లాభం 3 రెట్లు ప్లస్న్యూఢిల్లీ: చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 2,544 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 713 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో సాధించిన రూ. 143 కోట్లతో పోల్చినా లాభాలు భారీగా బలపడ్డాయి. ఇంధన రిటైలింగ్ బిజినెస్ పన్నుకుముందు లాభం రూ. 981 కోట్ల నుంచి రూ. 4,566 కోట్లకు జంప్‌చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించడం ఇందుకు తోడ్పాటునిచ్చింది. మరోవైపు దేశీ వంటగ్యాస్(ఎల్పీజీ) విక్రయాలలో రూ. 3,100 కోట్లమేర అండర్ రికవరీ(ఉత్పత్తికంటే తక్కువధరకు అమ్మడం)లను నమోదు చేసింది. తాజా సమీక్షా కాలంలో హెచ్‌పీసీఎల్ 6.47 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. గతేడాది క్యూ3లో 5.34 ఎంటీ చమురును శుద్ధి చేసింది. అమ్మకాలు 11.36 ఎంటీ నుంచి 12.32 ఎంటీకి పెరిగాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, హడ్కో ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 2% నామమాత్ర వృద్ధితో రూ.16,736 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.16,373 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 17,258 కోట్ల నుంచి రూ.17,657 కోట్లకు స్వల్పంగా బలపడింది. రుణ వృద్ధి నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,15,016 కోట్ల నుంచి రూ. 1,12,194 కోట్లకు క్షీణించింది. వడ్డీ ఆదాయం ప్లస్...ప్రస్తుత సమీక్షా కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ.30,650 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,450 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.43 శాతం వద్ద నిలకడను చూపాయి. ఆస్తుల (రుణాల) నాణ్యత విషయానికివస్తే తాజా స్లిప్పేజీలు రూ. 6,400 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగశాయి. అనుబంధ సంస్థలలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర లాభం రూ. 470 కోట్లను తాకగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 410 కోట్లు, అసెట్ మేనేజ్మెంట్ రూ. 640 కోట్లు, సెక్యూరిటీస్ రూ. 270 కోట్లు చొప్పున లాభాలు ఆర్జించాయి. టాటా కమ్యూనికేషన్స్ లాభం హైజంప్రూ.257 కోట్లుగా నమోదున్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 257 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 45 కోట్లు ఆర్జించింది. అయి తే పన్ను సంబంధిత రూ. 185 కోట్ల వన్‌టైమ్ ప్రొవిజన్ ఇందుకు కారణం. కాగా.. మొత్తం ఆదా యం 3% బలపడి రూ. 5,798 కోట్లను తాకింది.ఇదీ చదవండి: ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్నురాణించిన హడ్కోడిసెంబర్ క్వార్టర్లో రూ.735 కోట్ల లాభంన్యూఢిల్లీ: పట్టణ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందించే ప్రభుత్వరంగ హడ్కో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు పరంగా రాణించింది. సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతం వృద్ధితో రూ.735 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.519 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం ఇదే కాలంలో రూ.2,023 కోట్ల నుంచి రూ.2,770 కోట్లకు వృద్ధి చెందింది. వాద్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (వీపీపీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని సమకూర్చే అవకాశాలను ఈ ఒప్పందం కింద పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. వీపీపీఎల్ అన్నది జవహర్‌లాన్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. -
రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.3,793 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,781 కోట్లతో పోలిస్తే కేవలం రూ.12 కోట్లు పెరిగింది. ఆదాయం రూ.11,530 కోట్ల నుంచి రూ.11,846 కోట్లకు వృద్ధి చెందింది. స్థిరాస్తుల స్థూల విలువ రూ.2,78,983 కోట్లకు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.38,575 కోట్ల విలువ చేసే ఎనిమిది ప్రాజెక్టులకు పవర్‌గ్రిడ్ విజయవంతమైన బిడ్డర్‌గా అర్హత సాధించింది.రూ.4.5 డివిడెండ్..వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే పవర్‌గ్రిడ్ కాలా అంబ్ ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ పర్లి ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ జబల్పూర్ ట్రాన్స్‌మిషన్‌ను పవర్‌గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (పీజీఇని్వట్)కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర పెద్దగా మార్పుచెందకుండా రూ.318 వద్ద క్లోజ్ అయింది. బ్లూస్టార్ ఆకర్షణీయ ఫలితాలుకూలింగ్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ లిమిటెడ్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.71 కోట్ల నుంచి రూ.96 కోట్లకు దూసుకుపోయింది. 35 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,276 కోట్లుగా నమోదైంది. బలమైన ఆర్డర్ల పైప్‌లైన్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు.. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగినట్టు బ్లూస్టార్ తెలిపింది. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, వాణిజ్య ఏసీ సిస్టమ్స్ ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,428 కోట్లకు చేరింది. ఈ విభాగం మార్జిన్లు 2.2 శాతం బలపడ్డాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టుల విభాగంలో తయారీ రంగం, డేటా సెంటర్ల నుంచి వృద్ధి కనిపించింది. యూనిటీ ప్రొడక్టుల (రూమ్ ఏసీలు కూడా) ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.767 కోట్లుగా నమోదైంది. ప్రొఫెషనల్ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్ సిస్టమ్స్ ఆదాయం స్వల్పంగా క్షీణించి రూ.80 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఏసీల వ్యాపారం సానుకూలంఅన్ని విభాగాల్లోనూ అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు, రూమ్ ఏసీలు, వాణిజ్య ఏసీల వ్యాపారం మంచి పనితీరు చూపిస్తున్నట్టు సంస్థ చైర్మన్, ఎండీ ఎస్ అద్వానీ తెలిపారు. 2024–25 సంవత్సరం పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డైరెక్టర్ పీవీ రావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ప్రాజెక్టులు, సొల్యూషన్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్లూస్టార్ షేరు ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,878 వద్ద క్లోజ్ అయింది. -
ఏబీబీ ఇండియా, ఐఆర్‌ఎప్‌సీ ఫలితాలు
ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. జులై–సెప్టెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ.440 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ.362 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ.2,846 కోట్ల నుంచి రూ.3,005 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 11 శాతం అధికంగా రూ.3,342 కోట్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. దీంతో మొత్తం ఆర్డర్ల విలువ రూ.9,995 కోట్లకు చేరింది. ఇది 25 శాతం వృద్ధి.ఇదీ చదవండి: ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..ఐఆర్ఎఫ్సీ లాభం ప్లస్ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీ..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ.1,613 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.1,545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,762 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ.5,218 కోట్ల నుంచి రూ.5,288 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. మినీరత్న కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 సెప్టెంబర్‌కల్లా రూ.4,62,283 కోట్లకు చేరాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 0.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
ఇండిగో లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లాభం మార్చి త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.117 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,097 కోట్లతో పోలిస్తే, 35 శాతం వృద్ధి తో రూ.8,260 కోట్లుగా నమోదైంది. ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇండిగో లాభం అతి తక్కువగా రూ.156 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2017–18లో వచ్చిన లాభం రూ.2,242 కోట్లతో పోలిస్తే 93 శాతం తగ్గిపోయింది. దేశీయంగా విమానయాన పరిశ్రమకు 2018–19 చాలా కఠినమైన కాలంగా ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా పేర్కొన్నారు. అధిక ఇందన ధరలు, బలహీన రూపాయికి తోడు, తీవ్రమైన పోటీ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు చెప్పారు. మొదటి ఆరు నెలలు నష్టాలను ఎదుర్కోగా, తదుపరి ఆరు నెలలు రికవరీ చేసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తు విషయంలో బుల్లిష్‌గానే ఉన్నామని చెప్పారు. -
రికార్డు స్థాయిలోకి జంప్ చేసిన శాంసంగ్
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ రికార్డు గరిష్టాల్లోకి ఎగిసింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నిర్వహణ లాభాలు 64 శాతం పైకి జంప్ చేశాయి. బ్లాక్‌బస్టర్ సెమీ కండక్టర్ బిజినెస్‌లతో 2017లో అతిపెద్ద వార్షికాదాయాన్ని శాంసంగ్ తన సొంతం చేసుకుంది. మంగళవారం ప్రకటించిన తన క్వార్టర్లీ ఫలితాల రిపోర్టులో గతేడాది నాలుగో క్వార్టర్లో కంపెనీ నిర్వహణ లాభాలు 14.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిసింది. అంచనాలను మిస్ చేసినప్పటికీ లాభాల్లో మాత్రం ముందటేడాది కంటే ఎక్కువగానే సాధించింది. అదేవిధంగా కంపెనీ విక్రయాలు 24 శాతం పెరిగి, రికార్డు స్థాయిలో 61.8 బిలియన్ డాలర్లుగా నమోదుచేసినట్టు తెలిపింది. ఏడాదంతా కంపెనీ నిర్వహణాదాయం 50.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. అంటే 2016 నుంచి ఇది 83 శాతం అధికం. అయితే కంపెనీ తన ప్రతి వ్యాపారాల్లోనూ తనకు వచ్చిన నికర లాభాల గణాంకాలను బహిర్గతం చేయలేదు. ఈ నెల చివరిలో పూర్తి ఆర్థిక పనితీరును కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనుంది. శాంసంగ్ సెమీ కండక్టర్లకు డిమాండ్ స్కైరాకెట్గా ఎగియడంతో, మెమరీ చిప్‌ల ధరలు కూడా భారీగా పెరిగాయని, దీంతో కంపెనీకి మంచి లాభాలు ఆర్జించినట్టు తెలిసింది. పిక్చర్స్, వీడియోలు, ఫైల్స్, ఇతర డిజిటల్ డేటాను యూజర్లు తమ గాడ్జెట్లు, సర్వర్లలో ఎక్కువగా స్టోర్ చేస్తున్నారని దీంతో శాంసంగ్ మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోని డ్రామ్ మెమరీ చిప్స్‌లో సగభాగం శాంసంగ్ తన ఆధీనంలో ఉంచుకుందని పేర్కొన్నాయి. డ్రామ్ చిప్ తాత్కాలికంగా డేటాను స్టోర్చేస్తూ.. చాలా ప్రొగ్రామ్స్‌ను రన్ చేయడానికి కంప్యూటర్లకు సహకరించనున్నాయి. 2017లో పెరిగిన మెమరీ చిప్‌ల ధరలతో అతిపెద్ద లబ్దిదారునిగా శాంసంగ్ కంపెనీనే ఉన్నట్టు తేలింది. అయితే ఈ ఏడాది చిప్‌ల ధరలు తగ్గుతాయేమోనని కొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
ఐగేట్ నికర లాభం 7.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ సంస్థ ఐగేట్ గతేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు 3.31 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌కు ఆర్జించిన నికర లాభం(3 కోట్ల డాలర్లు)తో పోల్చితే 7.5 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర ఆదాయం 27 కోట్ల డాలర్ల నుంచి 10 శాతం వృద్ధితో 30 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది. ఉత్తర అమెరికా మార్కెట్లో భారీ డీల్స్ కారణంగా నికర ఆదాయం పెరిగిందని వివరించింది. ఈ సంస్థ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్ధిక సంవత్సరంగా పాటిస్తుంది. గతేడాది కంపెనీ పనితీరు పట్ల కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో అశోక్ వేమూరి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది భారీ డీల్స్‌ను సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. 9 మంది కొత్త క్లయింట్లు లభించారని, వీటిల్లో ఐదు ఫార్చ్యూన్ 1000 కంపెనీలు ఐదున్నాయని వివరించారు. ఇక పూర్తి సంవత్సరానికి కంపెనీ నికర లాభం 10 కోట్ల డాలర్ల నుంచి 36 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, నికర ఆదాయం 107 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 115 కోట్లకు పెరిగాయి.