ముంబై : ఫైనాన్సియల్ రంగంలో సైబర్ దాడులు అతిపెద్ద ముప్పుగా పరిణమిల్లుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు తమ బోర్డుల్లో ఐటీ నిపుణులను కలిగి ఉండాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. సైబర్ సెక్యురిటీ దాడులను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకులు విస్తృత స్థాయిలో సంస్థ ప్రేమ్‌వర్క్‌ను రూపొందించాల్సి ఉందని తెలిపింది. బ్యాంకింగ్ రంగం ఎక్కువగా టెక్నాలజీతో నడుస్తోంది. ఈ క్రమంలో కచ్చితంగా బోర్డు స్థాయిలో ఐటీ నిపుణులు అవసరమని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీనా హేమచంద్ర తెలిపారు. ఇవాళ ఇక్కడ సీఐఐ ఏర్పాటుచేసిన సైబర్ సెక్యురిటీ సదస్సులో ఆమె మాట్లాడారు. బ్యాంకు లేదా ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సైబర్ సెక్యురిటీ చర్యలను తీసుకోవడం ప్రారంభించాలని, దీనికి బోర్డు కట్టుబడి ఉండాలన్నారు.
బ్యాంకులు చాలా వేగవంతంగా ఉండాలని, లేదంటే బ్యాంకుల కంటే ఎక్కువ అడ్వాన్స్‌గా సైబర్ అటాకర్లు ఉన్నట్టు ఆమె తెలిపారు. సైబర్ సెక్యురిటీతో పాటు సంక్షోభం నుంచి బయటపడే ప్రణాళికలను కూడా రూపొందించుకునే అవసరం ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్లకు ఎంతైనా ఉందని హేమచంద్ర తెలిపారు. సైబర్ సెక్యురిటీలో ఎలాంటి ఉల్లంఘన జరిగిందని తెలిస్తే వెంటనే అథారిటీలకు, రెగ్యులేటర్స్‌కు సమాచారం అందించాలని, ఈ సమాచారంతో ఇతరులను ఈ దాడుల నుంచి రక్షించవచ్చన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు ఆర్‌బీఐ, సీఎస్‌ఓ ఫోరమ్ లాంటి వివిధ వర్గాల నుంచి ముప్పు వాటిల్లే సమాచారం అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment