
దేశ వ్యాప్తంగా కస్టమర్లకు అత్యుత్తమ ఆఫర్లతో అలరిస్తున్న రిలయన్స్ జియో త్వరలో 5జీ టెక్నాలజీతో మన ముందుకు రాబోతుంది. ధరల నియంత్రణ కోసం విదేశీ వెండర్లతో సంబంధం లేకుండా సొంత 5జీ నెట్‌వర్క్‌ను రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా ఒక మొబైల్ కంపెనీ ధర్డ్ పార్టీతో సంబంధం లేకుండా సొంత 5జీ టెక్నాలజీని రూపకల్పన చేశారని తెలుస్తోంది. అధునాతన టెక్నాలజీ ద్వారా పారిశ్రామిక, డిజిటల్, వ్యవసాయ రంగాలలో 5జీ టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సేవలందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. జియో తన 5జీ టెక్నాలజీ రూపకల్పనకు సొంత హార్డ్‌వేర్‌ను రూపొందించుకుందని కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు.