ఏప్రిల్‌లో పుంజుకున్న ఎల్‌ఐసీ వ్యాపారం | LIC improves performance in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో పుంజుకున్న ఎల్‌ఐసీ వ్యాపారం

Published Mon, Jun 15 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

ఏప్రిల్‌లో పుంజుకున్న ఎల్‌ఐసీ వ్యాపారం

ఏప్రిల్‌లో పుంజుకున్న ఎల్‌ఐసీ వ్యాపారం

ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో కాస్త నెమ్మదించిన ఎల్‌ఐసీ బీమా వ్యాపారం.. మళ్లీ పుంజుకుంటోంది. ఈ ఏడాది(2015-16) ఏప్రిల్‌లో ఎల్‌ఐసీ బీమా ప్రీమియం ఆదాయం 21 శాతం ఎగబాకగా.. కొత్త పాలసీ అమ్మకాల సంఖ్య కూడా 18 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఏప్రిలో ప్రీమియం రూపంలో రూ.3,582 కోట్లను ఎల్‌ఐసీ వసూలు చేసింది. గతేడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.2,966 కోట్లు మాత్రమే.

కాగా, పాలసీ అమ్మకాల సంఖ్య కూడా 7,14,572 నుంచి 8,43,235కు పెరిగింది. ఇదిలాఉండగా... తొలి ఏడాది బీమా ప్రీమియం ఆదాయం రూపంలో ఎల్‌ఐసీ మార్కెట్ వాటా ఏప్రిల్‌లో 68 శాతానికి తగ్గడం గమనార్హం. 2013-14లో ఎల్‌ఐసీ మార్కెట్ వాటా 75 శాతంకాగా, 2014-15లో 5 శాతం మేర తగ్గి 70 శాతానికి పడిపోయింది. కాగా, గతేడాది ప్రీమియం వసూళ్లు 14 శాతం క్షీణించి రూ.78,308 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఈ వసూళ్ల మొత్తం రూ.90,645 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement