భారీగా పడిపోయిన మార్కెట్లు
భారీగా పడిపోయిన మార్కెట్లు
Published Tue, Aug 8 2017 10:32 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM
ముంబై : స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపట్లోనే భారీగా పడిపోయాయి. నిఫ్టీ తన అత్యంత కీలకమైన మార్కు 10వేల కిందకి దిగజారింది. గత కొన్ని రోజులుగా 10వేల మార్కుకు పైన ట్రేడవుతూ వస్తున్న నిఫ్టీ, ఆ స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం 88.85 పాయింట్ల నష్టంలో 9,968 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ కూడా 283 పాయింట్ల మేర పతనమైంది. అన్ని రియాల్టీ స్టాక్స్ మార్కెట్‌లో నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఫైనాన్సియల్ స్టాక్స్ కూడా భారీగా పతనమవుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 1 శాతం మేర పడిపోయాయి. ఐటీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్ షేర్లు నిఫ్టీ ట్రేడింగ్‌లో భారీగా నష్టాలు పాలవుతున్నాయి.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు కూడా నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌లో అత్యధికంగా 130 పాయింట్ల మేర కిందకి పడిపోయాయి. అంతేకాక నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ కూడా 2.5 శాతం మేర డౌన్ అయింది. మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్, కరెక్షన్ చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. కేవలం మెటల్ స్టాక్స్ మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి.
Advertisement
Advertisement