హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మహీంద్రా మ్యూచువల్ ఫండ్... తాజాగా ‘క్రెడిట్ రిస్క్ యోజన’ పేరుతో కొత్త ఉత్పాదనను ఆవిష్కరించింది. ఈ ఫండ్ ఆఫర్ జూలై 27న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తుంది. ఏఏ, అంతకన్నా తక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్స్‌లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది.
మధ్య, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి కోరుకునే మదుపరుల కోసం ఈ ఓపెన్ ఎండెడ్ డెట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ అశుతోష్ బిష్ణోయ్ సోమవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్స్, బిజినెస్, రేటింగ్, క్రెడిట్ తదితర అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి పెడుతున్నాం.
ఏఏ, అంతకన్నా తక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్స్‌లో కనీసం 65 శాతం, డెట్, మనీమార్కెట్ సాధనాల్లో 35 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాం. క్రెడిట్ రిస్క్ యోజన ద్వారా రాబడి ఎఫ్‌డీ కంటే 100 నుంచి 150 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటుంది’ అని వెల్లడించారు. అంటే 1 – 1.5 శాతమన్న మాట. కంపెనీ ఇప్పటికే ఆరు రకాల ఫండ్స్‌ను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment