మార్కెట్లో ‘ట్రంప్’ సునామీ! | Modi, Donald trump the market: Sensex recovers but investor sentiment hit | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ‘ట్రంప్’ సునామీ!

Published Sat, Nov 12 2016 12:34 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

మార్కెట్లో ‘ట్రంప్’ సునామీ! - Sakshi

మార్కెట్లో ‘ట్రంప్’ సునామీ!

వెంటాడిన అమెరికా వడ్డీ రేట్ల పెంపు భయాలు
కొత్త అధ్యక్షుడు ట్రంప్ భారీ వ్యయ ప్రణాళికల ప్రభావం...
రూపారుు తీవ్ర క్షీణత, పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా...
విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంపై ఆందోళన  వర్ధమాన మార్కెట్లన్నీ కకావికలం...
సెన్సెక్స్ 699 పారుుంట్లు ఢమాల్; 27 వేల పారుుంట్ల దిగువకు పతనం...
4 నెలల కనిష్ట స్థారుు  గత 9 నెలల్లో ఒకే రోజు ఇంత భారీ పతనం ఇదే...
నిఫ్టీ 229 పారుుంట్లు డౌన్  ఆటోమొబైల్, రియల్టీ, టెలికం షేర్లు విలవిల...


డొనాల్డ్ ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై న రోజున మార్కెట్లో మొదలైన ప్రకంపనలు.. రెండు రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లపై సునామీ రూపంలో విరుచుకుపడ్డారుు. ట్రంప్ అమలు చేయనున్న భారీ వ్యయ ప్రణాళికలు..

అమెరికాలో వడ్డీరేట్లు మరింతగా పెరిగేందుకు దారితీస్తాయన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నారుు. ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కితీసేసుకోవచ్చన్న ఆందోళనలతో శుక్రవారం భారత్ సహా పలు వర్ధమాన దేశాల మార్కెట్లను కకావికలం చేశారుు. మరోపక్క, కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం, రూపారుు విలువ తీవ్రంగా పడిపోవడం వంటివి కూడా మన మార్కెట్లను దెబ్బకొట్టారుు. సెన్సెక్స్ 699 పారుుంట్లు, నిఫ్టీ 229 పారుుంట్లు చొప్పున కుప్పకూలారుు.

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా గ్యాప్ డౌన్‌తో మొదలయ్యారుు. ముందురోజు జరిపిన రిలీఫ్ ర్యాలీ ఆవిరైంది. సెన్సెక్స్ క్రితం రోజు ముగింపు 27,517తో పోలిస్తే 173 పారుుంట్లు దిగజారి ఆరంభమైంది. ఆతర్వాత ఇన్టెస్టర్ల అమ్మకాలు పోటెత్తడంతో నష్టాలు అంతకంతకూ తీవ్రతరమయ్యారుు. ఒకానొక దశలో సెన్సెక్స్ 740 పారుుంట్లు కుప్పకూలి 26,777 పారుుంట్లకు పడిపోరుుంది. చివరకు 699 పారుుంట్లు(2.54%) నష్టంతో 26,818 వద్ద ముగిసింది. గడిచిన తొమ్మిది నెలల్లో ఒకే రోజు సెన్సెక్స్ ఇంత భారీగా క్షీణించడం ఇదే తొలిసారి. అంతక్రితం ఫిబ్రవరి 11న 807 పారుుంట్లు పడింది. అంతేకాదు ఈ ఏడాది జూన్ 30న ముగింపు 27,000 పారుుంట్లతో పోలిస్తే మళ్లీ ఈ స్థారుుకి దిగువన ముగియడం కూడా ఇప్పుడే కావడం గమనార్హం. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,285-8,461 పారుుంట్ల మధ్య కదలాడింది. చివరకు 229 పారుుంట్లు(2.69 శాతం) నష్టంతో 8,296 వద్ద స్థిరపడింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థారుు.

 ఆసియా మార్కెట్లలో అమ్మకాలు...
వడ్డీరేట్ల పెంపు భయాలతో అమెరికా బాండ్ ఈల్డ్‌లు ఎగబాకడంతో ఆసియాలోని ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశారుు. హాంకాంగ్ సూచీ 1.35 శాతం, తైవాన్ 2.12 శాతం పడ్డారుు. ఇక వర్థమాన మార్కెట్లలో బ్రెజిల్ ఇండెక్స్ 2.72 శాతం పడిపోరుుంది. యూరప్ సూచీలు కూడా నష్టాలతోనే ట్రేడవుతున్నారుు. కాగా, ముందురోజు అమెరికా మార్కెట్‌లో డౌజోన్‌‌స 200 పారుుంట్లకు పైగా లాభంతో ముగియగా... టెక్నాలజీ కంపెనీలకు చెందిన నాస్‌డాక్ సూచీ 50పైగా పారుుంట్లను నష్టపోరుుంది. ఇక శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ రెండు సూచీలూ నష్టాల్లోనే ట్రేడవుతున్నారుు.

ఇతర ప్రధానాంశాలు..
బీఎస్‌ఈలో సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా కుప్పకూలారుు. 3.62%, 3.42% చొప్పున పడ్డారుు.

ఇక విభాగాల వారీగా చూస్తే.. ఆటోమొబైల్ ఇండెక్స్ అత్యధికంగా 4.53 శాతం క్షీణించింది. భారీగా పడిన ఇతర సూచీల్లో కన్సూమర్ డ్యూరబుల్స్(4.19%), రియల్టీ(4%), టెలికం(3.4%), ఎఫ్‌ఎంసీజీ(3.24%), ఫైనాన్‌‌స(3.05%), బ్యాంకెక్స్(2.51%) ఉన్నారుు.

సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 29 నష్టాల్లోనే ముగిశారుు. ఒక్క సన్ ఫార్మా మాత్రమే ఆర్థిక ఫలితాలు బాగుండటంతో 3.3 శాతం లాభపడింది.

సెన్సెక్స్ అత్యధికంగా నష్టపోరుున షేర్లలో అదానీ పోర్ట్స్(5.86%), ఐసీఐసీఐ బ్యాంక్(5.32%), హీరో మోటో(5.18%), ఏషియన్ పెరుుంట్స్(5%), టాటా మోటార్స్(5%), హెచ్‌డీఎఫ్‌సీ(4.55%), మారుతీ(3.54%), బజాజ్ ఆటో(3.19%), ఐటీసీ(3.11%), ఎస్‌బీఐ (3.09%) ఉన్నారుు.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం కూడా రూ.1,493 కోట్ల విలువైన షేర్లను విక్రరుుంచారు. గురువారం కూడా రూ.733 కోట్ల షేర్లను నికరంగా విక్రరుుంచారు.

బీఎస్‌ఈ నగదు విభాగంలో రూ. 3,462 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ క్యాష్ లో రూ.26,089 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఎన్‌ఎస్‌ఈ డెరివే టివ్‌‌స(ఎఫ్‌అండ్‌ఓ)లో రూ.4,77,553 కోట్ల టర్నోవర్ జరిగింది.

సోమవారం సెలవు: గురునానక్ జయంతి సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు సోమవారం(14న) సెలవు ప్రకటించారు.

ఎందుకీ పతనం..
అమెరికా వడ్డీరేట్ల పెంపు భయం: కొత్త అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్.. తమ దేశంలో మౌలిక సదుపాయాల పెంపు కోసం భారీస్థారుు నిధులను వెచ్చించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా అక్కడ వడ్డీరేట్ల పెంపునకు దారితీస్తుందన్న భయాలు వర్ధమాన మార్కెట్లను వణికిస్తున్నారుు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే(డిసెంబర్ సమీక్షలో మరో పావు శాతం పెంచుతుందని అంచనా) ఈ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లను కంటిమీద కునుకులేకుండా చేస్తోందని బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు.

అమెరికా బాండ్ ఈల్డ్‌లు పెరగడం: వడ్డీరేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో అమెరికాలో బాండ్ ఈల్డ్‌లు ఎగబాకుతున్నారుు. ఇది కూడా ఆసియా మార్కెట్లలో అమ్మకాలకు దారితీస్తోంది. ఇది మన మార్కెట్‌పైనా ప్రబావం చూపింది.

రూపారుు పతనం: డాలరుతో రూపారుు మారకం విలువ 59 పైసలు కుప్పకూలి మళ్లీ 67 దిగువకు పడిపోరుుంది. ఇది కూడా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను దిగజార్చింది.

నిరాశపరుస్తున్న బ్లూచిప్స్ ఫలితాలు: సెన్సెక్స్ జాబితాలో ఉన్న బ్లూచిప్ కంపెనీల్లో కొన్ని క్యూ2 ఫలితాలను అత్యంత నిరుత్సాహకరంగా ప్రకటిస్తున్నారుు. భారీ మొండిబకారుుల కారణంగా ఎస్‌బీఐ క్యూ2 నికర లాభం(కన్సాలిడేటెడ్) 99.6 శాతం దిగజారి రూ.20.7 కోట్లకు పడిపోవడం గమనార్హం.

లాభాల స్వీకరణ: వచ్చే సోమవారం సెలవు(గురునానక్ జయంతి) కారణంగా వరుసగా మూడు రోజులు మార్కెట్ల సెలవు నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం(గురువారం మార్కెట్ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే).

పెద్ద నోట్ల రద్దు ప్రకంపనలు: మోదీ సర్కారు రూ.500; రూ.1,000 నోట్లను రద్దు చేయడంతో వ్యాపారాలు దెబ్బతినడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నారుు. ఆటోమొబైల్, రియల్టీ, జ్యుయెలరీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు మరింత జోరందుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement