మార్కెట్లో ‘ట్రంప్’ ప్రకంపనలు.. | Sensex falls 1.25% as Donald Trump poll gains spook markets | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ‘ట్రంప్’ ప్రకంపనలు..

Published Thu, Nov 3 2016 1:11 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

మార్కెట్లో ‘ట్రంప్’ ప్రకంపనలు.. - Sakshi

మార్కెట్లో ‘ట్రంప్’ ప్రకంపనలు..

తాజా పోల్‌లో హిల్లరీ క్లింటన్ వెనుకబడడంతో ఆందోళన
349 పాయింట్లు పడిపోరుున సెన్సెక్స్
112 పాయింట్లు కోల్పోరుు 8,514 వద్ద క్లోజయిన నిఫ్టీ
ఇది మూడు నెలల కనిష్ట స్థాయి

ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు అంచనాల్లో మార్పులు స్టాక్ మార్కెట్లలో బుధవారం కలవరం సృష్టించారుు. ఇన్వెస్టర్లు ఇప్పటి వరకూ హిల్లరీ క్లింటన్ గెలుస్తుందన్న అంచనాలతో ఉండగా... తాజా పోల్‌లో డోనాల్డ్ ట్రంప్ హిల్లరీ క్లింటన్‌ను దాటుకుని ముందుకు రావడం అమ్మకాలకు పురిగొల్పింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు క్షీణించారుు. ఇదేబాటలో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 349 పారుుంట్లు పతనం అరుుంది. 27,527.22 వద్ద ముగిసింది.

అటు నిఫ్టీ సైతం కీలకమైన 8,600 పారుుంట్ల కంటే దిగువకు పడిపోరుుంది. ఇంట్రాడేలో 8,504.85 పారుుంట్ల వరకు పడిపోరుున నిఫ్టీ చివరికి 112.25 పారుుంట్ల నష్టంతో మూడు నెలల కనిష్ట స్థారుు అరుున 8,514 వద్ద ముగిసింది. జూలై 21 తర్వాత నిఫ్టీ ఇంత తక్కువన ముగియడం మళ్లీ ఇదే. అదే విధంగా అక్టోబర్ 13 తర్వాత ఒక రోజులో సెన్సెక్స్ అత్యధికంగా నష్టాలను మూటగట్టుకోవడం కూడా ఇదే. అమెరికా అధ్యక్ష ఎన్నికలకుతోడు యూఎస్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమై... రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యారుు.

 అమెరికా ఎన్నికల భయాందోళనలు, బుధవారం నాటి ఫెడ్ సమావేశం నేపథ్యంలో మార్కెట్లకు అధిక అమ్మకాలు ఎదురయ్యాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘ట్రంప్, హిల్లరీకి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంటుందని అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. దీంతో అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మార్కెట్లలో ఆటు పోట్లు కొనసాగుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫెడ్ కీలక రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలే ఉన్నప్పటికీ... రేట్లు పెంపు సంకేతాలు ఏమైనా వెలువడతాయా అని మార్కెట్లు దృష్టి పెట్టారుు’ అని వినోద్ నాయర్ వివరించారు.

వెలుగులో ఎమ్‌అండ్‌ఎమ్...
సెన్సెక్స్ స్టాక్స్‌లో ఓఎన్‌జీసీ అత్యధికంగా 4 శాతం నష్టపోరుు రూ.277.35 వద్ద ముగిసింది. ఆ తర్వాత టాటా మోటార్స్ 3 శాతానికి పైగా నష్టంతో రూ.514కు చేరింది. ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఆర్‌ఐఎల్, భారతీ ఎరుుర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకీ, ఏసియన్ పెరుుంట్స్, ఐసీఐసీఐ బ్యాంకు 2.75 శాతం వరకూ నష్టాలను చవిచూశారుు. మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా మహీంద్రా అండ్ మహీంద్రా షేరు వెలుగులో నిలిచింది. ఈ స్టాక్ 3.54 శాతం లాభపడి రూ.1,369.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 26 శాతం నష్టాల్లోనే క్లోజయ్యారుు. బీఎస్‌ఈ ఆరుుల్ అండ్ గ్యాస్ సూచీ 2.76 శాతం, రియల్టీ 2.18 శాతం, పీఎస్‌యూ 2.05 శాతం, ఇన్‌ఫ్రా 2 శాతం వరకు కోల్పోయారుు. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2 శాతం వరకు నష్టాలను ఎదుర్కొన్నారుు. బీఎస్‌ఈలో 1,967 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 965 స్టాక్స్ లాభాలను సొంతం చేసుకున్నారుు. 110 స్టాక్స్ ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా క్రితం ముగింపు వద్దే ముగిశారుు.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం రూ.129.6 కోట్ల మేర విక్రయాలు జరిపినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

 ప్రపంచ మార్కెట్లన్నీనష్టాల్లోనే..
ఆసియా, యూరోప్ మార్కెట్లలోనూ ఇదే వాతావరణం నెలకొంది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఏడు వారాల కనిష్ట స్థారుులకు చేరారుు. జపాన్ నికాయ్ 1.76 శాతం నష్టపోరుుంది. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.63 శాతం,  హ్యాంగ్ సెంగ్ 1.45 శాతం చొప్పున కోల్పోయారుు. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన యూరోప్ మార్కెట్లలోనూ అమ్మకాలు చోటు చేసుకున్నారుు. ఫలితంగా లండన్ ఎఫ్‌టీఎస్‌ఈ 0.36 శాతం, ఫ్రాన్‌‌స పారిస్ సీఏసీ-30 0.61 శాతం, జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ 0.72 శాతం చొప్పున నష్టాలతో కొనసాగారుు. చివరికి ఎఫ్‌టీఎస్‌ఈ ఒక శాతం, సీఏసీ 1 శాతానికి పైగా నష్టంతో ముగిశారుు. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement