నల్లధనంపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధాని తర్వాతి టార్గెట్‌గా స్థిరాస్తులపై ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రాపర్టీ లావాదేవీలన్నింటిన్నీ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ చేసేలా నిర్ణయం తీసుకోబోతున్నారని కేంద్ర మంత్రి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుండెల్లో గుబేలు రేపుతోంది. ప్రాపర్టీ లావాదేవీలను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి, అందులో ఎలాంటి సందేహం లేదంటూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్‌దీప్ పురి, ఈటీ నౌ ప్రతినిధితో చెప్పారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో కూరుకుపోయిన బ్లాక్‌మనీని బయటికి తీయవచ్చని, బినామి ప్రాపర్టీలపై కూడా ఉక్కుపాదం మోపవచ్చని పేర్కొన్నారు. ఆధార్‌తో ప్రాపర్టీ లావాదేవీలు జరుపడం ఎంతో ఉన్నతమైన ఆలోచని, కానీ తాను ఆ ప్రకటన చేయకూడదంటూ పేర్కొన్నారు.
ఇప్పటికే బ్లాక్‌మనీని నిరోధించడానికి ఆధార్ లింక్‌ను ప్రతిదానికి తప్పనిసరి చేస్తూ వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకు అకౌంట్లు, పాన్ కార్డులకు వంటి వాటికి ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది. ప్రాపర్టీ మార్కెట్‌ను కూడా ఇక ఆధార్ గూటి కిందకు తెచ్చేస్తుంది. బినామీ ప్రాపర్టీలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పలు మార్లు ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికల్లో భాగమే ఆధార్ లింకేజీలో అని తెలుస్తోంది. అయితే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారలేదని పురి చెప్పారు. ప్రతి దానికి ఆధార్ లింక్ చేస్తుండటంతో, దీనిపై ఇప్పటికే పలు పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment