దేశ ఆర్థిక వ్యవస్థకు మరో షాక్ తగిలింది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ భారత క్రెడిట్ రేటింగ్స్ అంచనాలను తగ్గించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు 5 శాతం కనిష్టానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్‌కు కేటాయించబోతున్నట్లు మూడీస్ అంచనా వేసింది. దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణబారం నేపథ్యంలో రేటింగ్స్ తగ్గాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్థి మందగమనం వల్ల ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం కలుగుతుందని మూడీస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ ఫోస్టర్ తెలిపారు. మూడీస్ ప్రకటన తర్వాత ఒక నెల రోజులు డాలర్, రూపాయలను పంపిణీ చేయలేమని ఫార్వర్డ్‌స్ రోస్ ప్రకటించడం గమనార్హం. వినియాగదారుల రుణాలు తీర్చడంలో ప్రధాన వనరుగా ఉన్న బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలలో సమస్యలు అంత త్వరగా తీరబోవని తెలిపింది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్, ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారతదేశ దృక్పథాన్ని అభినంధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment