యాక్సెసరీస్‌లో కొత్త బ్రాండ్‌ ‘కనెక్ట్‌’ | New range of mobile accessories unveiled by Conekt | Sakshi
Sakshi News home page

యాక్సెసరీస్‌లో కొత్త బ్రాండ్‌ ‘కనెక్ట్‌’

Published Fri, Aug 17 2018 12:54 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

New range of mobile accessories unveiled by Conekt - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యాక్సెసరీస్‌ రంగంలోకి కొత్త బ్రాండ్‌ ‘కనెక్ట్‌ గాడ్జెట్స్‌’ ఎంట్రీ ఇచ్చింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రచార కర్త, క్రికెటర్‌ రోహిత్‌ శర్మ చేతుల మీదుగా విభిన్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. పవర్‌ బ్యాంక్స్, వాల్‌ చార్జర్స్, డేటా కేబుల్స్, కార్‌ మౌంట్, ఇయర్‌ ఫోన్స్, కార్‌ చార్జర్స్, వైర్‌లెస్‌ చార్జర్లు వీటిలో ఉన్నాయి. ప్రపంచ టాప్‌–3 థర్డ్‌ పార్టీ కంపెనీల్లో వీటిని తయారు చేయిస్తున్నట్టు కనెక్ట్‌ గాడ్జెట్స్‌ సీవోవో ప్రదీప్‌ యెర్రగుంట్ల ఈ సందర్భంగా తెలిపారు.

‘అన్ని ఉత్పాదనలకు సీఈ ధ్రువీకరణ ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీలో సేల్స్‌ కార్యాలయాలను ప్రారంభించనున్నాం. ఈ ఏడాదే ఎగుమతులు మొదలుపెట్టి రెండేళ్లలో 40 దేశాల్లో అడుగుపెడతాం. మార్చికల్లా రూ.100 కోట్లు, 2019–20లో రూ.250 కోట్ల వ్యాపారం లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. దేశంలో 5,000 దుకాణాల్లో యాక్సెసరీస్‌ అందుబాటులో ఉన్నాయని కంపెనీ సీఎంవో ఆశిష్‌ కుంభట్‌ చెప్పారు.  హైదరాబాద్‌ కేంద్రంగా కనెక్ట్‌ గాడ్జెట్స్‌ కార్యకలాపాలు సాగించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement