స్వల్పంగా పెరిగిన పెట్రోలు డీజిల్‌ ధరలు | Petrol diesel prices increased on Thursday | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన పెట్రోలు డీజిల్‌ ధరలు

Jun 27 2019 10:17 AM | Updated on Jun 27 2019 10:31 AM

Petrol diesel prices increased on Thursday - Sakshi

సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు పుంజుకున్నాయి. బుధవారం  2 శాతం క్రూడ్‌ ధరలు పెరగడంతో  దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం (జూన్ 27)  పెట్రోల్, డీజిల్ రిటైల్ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు 7పైసలు, డీజిల్ ధర లీటరుకు 5-6 పైసలు పెరిగాయి. ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ స​మాచారం ప్రకారం  ఢిల్లీలో పెట్రోల్ ధర బుధవారం రూ .70.05 వద్ద ఉండగా  డీజిల్ ధర రూ .63.95గా ఉంది. 

అమరావతి : లీటరు పెట్రోలు రూ. 74. 31 డీజిల్‌  లీటరు రూ. 69.15
హైదరాబాద్‌ : లీటరు పెట్రోలు రూ. 74.52 డీజిల్‌  లీటరు రూ. 69.70
కోలకతా : లీటరు పెట్రోలు రూ. 72.38 డీజిల్‌  లీటరు రూ. 65.87
చెన్నై: లీటరు పెట్రోలు రూ. 72.84  డీజిల్‌  లీటరు రూ. 67.64 
ముంబై : లీటరు పెట్రోలు రూ. 75.82  డీజిల్‌  లీటరు రూ. 67.05

మరోవైపు గురువారం అంతర్జాతీయ చమురు మార్కెట్లో, ముడి ధరలు తగ్గుముఖం పట్టాయి. రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి.  జి20 శిఖరాగ్ర సమావేశం, ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తిదారుల సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. అంతర్జాతీయంగా  ముడి చమురు ధరలు( ఫ్యూచర్స్ )బ్యారెల్‌కు  0.3శాతం క్షీణించి  66.30 డాలర్లుగా ఉంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement