న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ కంపెనీ 2017–18 క్యూ4 చూసినా.. ఏడాది మొత్తం చూసినా రికార్డు స్థాయి లాభాలొచ్చాయి. 2016–17 క్యూ4లో రూ.471 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో 11 శాతం వృద్ధితో రూ.523 కోట్లకు పెరిగిందని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ఎమ్‌డీ, సీఈఓ ప్రభాత్ సింగ్ చెప్పారు. అమ్మకాలు అధికంగా ఉండటం, కార్యకలాపాల్లో సామర్థ్యం కారణంగా క్యూ4లో రికార్డ్ స్థాయి నికర లాభం సాధించామన్నారు.
ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.4.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో నికర లాభం 21% వృద్ధితో రూ.2,078 కోట్లకు పెరిగిందని, ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ షేర్ 3.5 శాతం నష్టంతో రూ.211 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment