రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా రాజన్ బాధ్యతలు
ముంబయి : రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ ఆర్థిక మేధావుల్లో ఒకరిగా పేరు పొందిన రాజన్.. మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రూపాయి.. గుక్క పెట్టి ఏడుస్తున్న పాపాయిలా మారిన తరుణంలో రాజన్ ఎలాంటి వ్యూహం అవలంభిస్తారు? ఆర్థిక వ్యవస్థ దారిలో పెట్టడానికి రిజర్వ్ బ్యాంకు తరఫున ఎలాంటి సహకారం అందిస్తారు? లాంటి ప్రశ్నలు పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
2008 ఆర్థిక సంక్షోభాన్ని కరెక్ట్ అంచనా వేసిన వారిలో రాజన్ ఒకరు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎమ్ఎఫ్లో చీఫ్ ఎకానమిస్ట్‌గా పని చేసిన రాజన్ సేవలు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఉపయోగపడతాయని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. వీరి అంచనా నిజం కావాలని.. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడిన పడాలని కోరుకుందాం.