ఆర్‌బీఐ స్వేచ్ఛను కాపాడాలి!
మాజీ గవర్నర్ బిమల్ జలాన్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్వయం ప్రతిపత్తిని నిలబెట్టాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆకాంక్షించారు. 1997 నుంచి 2003 మధ్య జలాన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ‘ప్రతిష్ట మసకబారే సమస్య’ను ఆర్‌బీఐ ఎదుర్కొంటోందని మరో మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలోనే జలాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఆర్‌బీఐ స్వతంత్రత ప్రాథమిక అంశం. దీనిని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ అంశంపైనా దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. ఇక రూ.500, రూ.1000 నోట్ల రద్దు వృద్ధిపై ఎంతశాతం ప్రభావం చూపుతుందన్నది చెప్పడం చాలా కష్టం. అయితే వృద్ధి తగ్గుతుందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. పరిస్థితిని ఊహించి చెప్పడం కన్నా... వేచి చూడడమే బెటర్’ తాజా ఇంటర్వ్యూలో జలాన్ వ్యాఖ్యానించారు.