ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్లకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదున ఉపసంహరణ పరిమితి రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అంతక్రితం ఈ పరిమితి రూ. 40,000గా ఉండగా.. తాజాగా మరో రూ. 10,000 పరిమితి పెంచింది. రుణాల విషయంలో బ్యాంక్ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని తేలిన నేపథ్యంలో ఆ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలను అమలు చేసిన విషయం తెలిసిందే.
సెపె్టంబర్ 23న ఈ విషయాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ.. తొలుత ఒక్కో ఖాతా నుంచి రూ. 1,000 ఉపసంహరణకే అనుమతించింది. ఆ తరువాత, తాజా ప్రకటనతో కలుపుకుని నాలుగు విడతలుగా పరిమితిని పెంచింది. ద్రవ్య లభ్యత అంశాన్ని పరిగణలోనికి తీసుకుని ఎప్పటికప్పుడు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నామని, ఈ క్రమంలోనే రూ. 50,000 పరిమితి పెంపు అనుమతి ఇచి్చనట్లు వివరించింది. డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్యాంక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment