ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల్లో చెల్లింపుల అలవాట్లు మారినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గాయని.. రిటైల్ ఎలక్ట్రానిక్ చెల్లింపులు, కార్డులు, చెక్కుల వాడకం పెరిగిందని ఒక అధ్యయనంలో పేర్కొంది. నోట్ల రద్దు సమయంలో పెరిగిన ఈ సాధనాల వినియోగం.. డీమోనిటైజేషన్ అనంతరం కూడా స్థిరంగానే కొనసాగుతోందని తెలిపింది. అధ్యయన నివేదిక ప్రకారం డీమోనిటైజేషన్‌కి ముందు చెక్కుల పరిమాణం, జారీ విలువ క్షీణించగా.. నోట్ల రద్దు తర్వాత సానుకూల వృద్ధి కనిపిస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. డీమోనిటైజేషన్ తర్వాత పాయింట్స్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌లో కార్డు లావాదేవీలు గణనీయంగా పెరిగాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment