తగ్గిన గృహ రుణ అకౌంట్ల సంఖ్య | Reduced housing loan Number of accounts | Sakshi
Sakshi News home page

తగ్గిన గృహ రుణ అకౌంట్ల సంఖ్య

Published Sun, Jan 4 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

తగ్గిన గృహ రుణ అకౌంట్ల సంఖ్య

తగ్గిన గృహ రుణ అకౌంట్ల సంఖ్య

చెన్నై: గృహ రుణ అకౌంట్ల సంఖ్య  2013లో అసలు పెరక్కపోగా, 2.7 శాతం క్షీణించింది. కమర్షియల్ బ్యాంకుల్లో 2012లో గృహ రుణ అకౌంట్ల సంఖ్య 47.78 లక్షలుకాగా, ఈ సంఖ్య 2013లో 46.43 లక్షలకు తగ్గింది. కాగా రుణ మంజూరీ విలువ మాత్రం రూ.2.6 లక్షల కోట్ల నుంచి 7.3 శాతం వృద్ధితో రూ.2.8 లక్షల కోట్లకు పెరిగింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. నగరాల్లో రియల్టీ అధిక ధరలు కస్టమర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. నిర్మాణం, ఆ రంగం ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరగడం కూడా అకౌంట్ల వృద్ధికి అవరోధంగా మారింది.  కాగా రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల శ్రేణిలో రుణం తీసుకున్న కస్టమర్ల సంఖ్య పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement