
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.213 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.6 కోట్ల నికర లాభం వచ్చిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. సాధారణ బీమా విభాగం మంచి లాభాలు సాధించడంతో ఈ క్యూ3లో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,386 కోట్ల నుంచి రూ.5,016 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆస్తులు 7 శాతం పెరిగి రూ.89,400 కోట్లకు పెరిగాయని వివరించింది.
ఈ క్యూ3లో మ్యూచువల్ ఫండ్ విభాగం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రూ.110 కోట్ల నికర లాభం సాధించిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. నిర్వహణ ఆస్తులు 7% పెరిగి రూ.4,14,362 కోట్లకు పెరిగాయని పేర్కొంది. హోమ్ ఫైనాన్స్ విభాగం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లోన్ బుక్ 26 శాతం ఎగసి రూ.16,160 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ 1.7% లాభంతో రూ.139 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment