రిలయన్స్‌​ జియో మరో ఆఫర్‌ | Reliance Jio offers additional data to Prime users | Sakshi

రిలయన్స్‌​ జియో మరో ఆఫర్‌

Mar 3 2017 9:30 PM | Updated on Sep 5 2017 5:06 AM

రిలయన్స్‌​ జియో మరో ఆఫర్‌

రిలయన్స్‌​ జియో మరో ఆఫర్‌

కొత్త కొత్త ప్లాన్లతో అంతకంతకూ టెలికం కంపెనీలు దిగివస్తుండటంతో..

ముంబై :
కొత్త కొత్త ప్లాన్లతో అంతకంతకూ టెలికం కంపెనీలు దిగివస్తుండటంతో.. రిలయన్స్‌ జియో శుక్రవారం మరో ఆఫర్‌ ప్రకటించింది. రూ.303లతో రీచార్జ్‌ చేసుకునే ప్రైమ్‌ యూజర్లకు ఇదివరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటాను కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అదే రూ.499తో రీచార్జ్‌ చేసుకుంటే 56 జీబీ డేటాతోపాటు 10 జీబీ డేటాను అదనంగా పొందొచ్చని తెలిపింది. ఈ అదనపు డేటా ప్రయోజనాలు కేవలం ఒక నెలకే వర్తిస్తాయని పేర్కొంది.

కాగా కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్‌ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకోని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. అయితే జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement