న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఇన్వెస్టర్లు 1.4 లక్షల కోట్ల మేర మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) తెలిపింది. లిక్విడ్, ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు బాగా వచ్చాయని వివరించింది.
ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.23.25 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి ఫండ్స్ నిర్వహణ ఆస్తులతో పోల్చితే ఇది 9 శాతం అధికమని వివరించింది. కాగా ఈ ఏడాది మార్చిలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.50,752 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని, కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాల మూలధన లాభాల పన్ను దీనికి కారణమని యాంఫీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment