
సాగర్ సిమెంట్స్ లాభం రూ.4.6 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో సాగర్ సిమెంట్స్ నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.23 కోట్ల నుంచి రూ.4.6 కోట్లకు పడిపోయింది. టర్నోవరు రూ.185 కోట్ల నుంచి రూ.136 కోట్లకు వచ్చి చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జూన్ క్వార్టర్‌లో రూ.197 కోట్ల టర్నోవర్‌పై రూ.26 లక్షల నష్టం వాటిల్లింది.