
మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు వచ్చిన ఆయన మరోసారి మోదీతో భేటీ అయ్యారు.
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో ఆయన సమావేశం కావడం ఇది రెండోసారి. మైక్రోసాఫ్ట్ సీఈవోగా తొలిసారి స్వదేశానికి వచ్చినప్పుడు మోదీని మొదటిసారి సత్య నాదెళ్ల కలిశారు. కాగా, భారత్ లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశముంది.