ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సూచీలు నష్టాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 25,431 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 31 పాయింట్ల వద్ద ఆరంభమై 7,734 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో అవి మన మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రూయాఇ పతనం కూడా కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్లో రూపాయి మారకం విలువ 10 పైసలు పడిపోయి 66.83కి చేరుకుంది.