ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల సవరణతోపాటు ,జిఎస్‌టి బిల్లకు సంబంధించి నెలకొని ఉన్న సందిగ్ధత మార్కెట్లలో కొంత ఒడిదుడుకులకు కారణమైంది. దీంతో ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 88 పాయింట్ల నష్టంతో 25, 221 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 7,700 దిగువకు ట్రేడ్ అవుతోంది. ఇక సెక్టార్ సూచీల్లో డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్గా ఉంది. నాలుగు శాతం నష్టపోయింది. మరోవైపు యూఎస్ డాలర్ విలువతో పోల్చితే రూపాయి 6 పైసలు లాభపడి మారకం విలువ 66.78గా ఉంది.