ముంబయి : స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. నిఫ్టీ సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకింది. 6574 పాయింట్లను చూసింది. ప్రస్తుతం 45 పాయింట్లు లాభపడుతూ 6,550కి సమీపంలో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 160 పాయింట్లు పెరుగుతూ 21,970కి సమీపంలో కొనసాగుతోంది. క్రిమియా రష్యాలో కలిసేందుకు సిద్ధపడటం మార్కెట్లకు కలిసి వస్తోంది. ఎన్డీఏ కూటమి మెజార్టీకి చేరువ అవుతుందనే అంచనా రావడం కూడా మార్కెట్లు లాభపడటానికి కారణమవుతోంది.
ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సులు తప్పించి మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ఉన్నాయి. మారుతీ షేరు ఈవాళ దుమ్ము రేపుతోంది. గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటుపై మైనార్టీ షేర్‌హోల్డర్ల అభిప్రాయం తీసుకుంటామని మారుతీ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లు పెద్ద యెత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం మారుతీ షేరు ధర 8 శాతం దాకా లాభడపతూ 1740 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ధర తగ్గుతోంది. ప్రస్తుతం ఎంసీక్స్లో 10 గ్రాముల ధర 200 రూపాయలు నష్టపోతూ 30,180లకు సమీపంలో ట్రేడవుతోంది. ఔన్స్ బంగారం ధర 1360 డాలర్లకు సమీపంలో కొనసాగుతోంది.
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్
Published Tue, Mar 18 2014 12:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement
Advertisement