ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీ సూచీ 0.73 శాతం లేదా 379 పాయింట్లు దిగజారి 51,324.69 మార్క్‌ను చేరుకుంది. నిఫ్టీ సూచీ కూడా 0.60 శాతం లేదా 90 పాయింట్లు నష్టపోయి 15,119 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.60గా ఉంది. ఇంట్రాడేలో 51,794 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ 51,194 వద్ద కనిష్ఠాన్ని తాకింది. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నెస్లే ఇండియా నష్టపోగా.. ఓఎన్ జీసి షేర్ ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్ ధరలు లాభపడ్డాయి.(చదవండి: అమెజాన్ ఇండియా భారీ మోసం!)
Comments
Please login to add a commentAdd a comment