దేశీయ ఈక్విటీ మార్కెట్ వరుసగా 4రోజూ లాభంతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్ లాభాల ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్ 301 పాయింట్ల లాభంతో 36322 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల పెరిగి 10714 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను మొదలయ్యాయి. సూచీలకిది వరుసగా 4రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2శాతం లాభపడి 22వేల పైన 22, 250 వద్ద ట్రేడ్ అవుతోంది.
భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదాలతో పాటు... అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకోవడం మార్కెట్లను కలవరపరిచే అంశంగా ఉంది. ఎన్‌బీసీసీతో పాటు 35 కంపెనీలు నేడు తమ మార్చి క్వార్టర్ ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ పరిణామాల దృష్టా‍్య ఇంట్రాడేలో సూచీలు ఆటుపోట్లను చవిచూడవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు
జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, బజాజ్‌ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండ్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 3.30శాతం లాభపడ్డాయి. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ యూనిలివర్, బజాజ్-అటో, గెయిల్ షేర్లు 0.10శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment