
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో సెషన్ లో కూడా కీలక సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 29600 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ 8600 స్థాయిని దాటేసింది. సెన్సెక్స్ 1143 పాయింట్లు పుంజుకుని 29679 వద్ద, నిఫ్టీ 317పాయింట్లు లాభంతో 8600వద్ద కొనసాగుతున్నాయి. దాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా వరుసగా రెండో రోజూ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ప్రారంభంలోనే ఒకటిన్నర లాభంతో రూ.1100 మార్కును అధిగమించింది. జియోలో 10శాతం వాటాను 60 బిలియన్ డాలర్లకు (రూ.4.20 లక్షల కోట్ల) విక్రయించనున్నట్టు వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు లాభపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment