సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి మహా పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, లాక్ డౌన్ ప్రకంపనలతో కీలక సూచీలు నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్ 2687 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ నిఫ్టీ 874 పాయింట్ల నష్టంతో వద్ద ట్రేడింగ్ అరంభించాయి. తద్వారా సెన్సెక్స్ 28వేల స్థాయిని, నిఫ్టీ 8వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఫార్మ రంగ షేర్ల లాభాలతో సూచీలు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2198 పాయింటు నష్టంతో 27707వద్ద, నిఫ్టీ 628 పాయింట్ల నష్టంతో 8118వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment