
‘సింధు’కు ఫిక్కీలో జీవితకాల సభ్యత్వం
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చిన బ్యాడ్మిం టన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జీవిత కాల సభ్యత్వం ఇచ్చేందుకు ఫిక్కీ మహిళా విభాగం (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్ ముందుకు వచ్చింది. సింధు తెలుగు వారందరికీ గర్వకారణమని హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ పద్మ ఆర్ పేర్కొన్నారు.
సింధు తమ సంఘం జీవితకాల సభ్యురాలైనందుకు గర్విస్తున్నామని... ఆమెను సత్కరించేందుకు కార్యక్రమానికి ఏర్పాటు చేయనున్నట్టు పద్మ ఓ ప్రకటనలో వెల్లడించారు.