
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థికమంత్రి దేశాధ్యక్షుడిని కలవడం సంప్రదాయం. ఈ సందర్భంగా బడ్జెట్ కాపీలను ఆమె రాష్ట్రపతికి అందించారు. దీంతో ఎన్‌డీఏ సర్కార్ రెండవ సారి బాధ్యతలను చేపట్టిన అనంతరం ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన మరో అడుగు వేశారు.
కాగా పార్లమెంటులో ఇవాళ ఉదయం 11 గంటలకు దేశ చరిత్రలో మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్‌ను ప్రశపెట్టనున్న సంగతి తెలిసిందే. రక్షణమంత్రిగా తనదైన ప్రతిభను చాటుకున్న ఆమె.. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితులలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ బడ్జెట్‌కు విశేష ప్రాధాన్యత లభిస్తోంది.
As per tradition, Finance Minister @nsitharaman calls on #PresidentKovind at Rashtrapati Bhavan before presenting the Union Budget#BudgetWithETNOW #Budget2019 #BudgetForBharat #UnionBudget2019 #financeminister pic.twitter.com/dDDJojEpuf
— ET NOW (@ETNOWlive) July 5, 2019