దాదాపు 2 వేల కోట్ల నష్టాల్లో మునిగిపోయిన స్పైస్ జెట్.. తమ విమానాలు ఎగరాలంటే అత్యవసరంగా ఆర్థికసాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పౌర విమానయానశాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మను కలిసిన స్పైస్ జెట్ ఉన్నతాధికారులు.. తమకు అత్యవసరంగా ఆర్థికసాయం చేయాలని విన్నవించారు. అయితే, అలాంటి నిర్ణయాలు ఏవైనా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలోనే తీసుకోవాల్సి ఉంటుందని వారికి మంత్రి చెప్పారు. వాళ్ల విజ్ఞప్తిని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖల వద్ద పెడతానని మాత్రం తెలిపారు. వాళ్లకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ఆయన అన్నారు.
అంతకుముందు స్పైస్ జెట్ అధికారులు డీజీసీఏ చీఫ్ ప్రభాత్ కుమార్ను కలిసి, తమ పరిస్థితి వివరించారు. ఉద్యోగులకు పెండింగులో ఉన్న జీతాలు చెల్లించేందుకు స్పైస్ జెట్ సంస్థకు డీజీసీఏ సోమవారం వరకే గడువు ఇచ్చింది. అలాగే 1600 కోట్ల మేర చేయాల్సిన చెల్లింపుల విషయం కూడా చెప్పాలంది. నెల రోజుల్లోనే దాదాపు 1800 ట్రిప్పులను రద్దు చేయడంతో సంస్థ భారీగా నష్టపోయింది.
మునిగిపోతున్నాం.. ఆదుకోండి: స్పైస్ జెట్
Published Mon, Dec 15 2014 7:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement