
విమానంలోనే యోగా క్లాసులు!
అంతర్జాతీయ యోగా దినోత్సవం పుణ్యామని ఒక్కొక్కరికి ఒక్కో రకం ఐడియాలు వస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే ఎయిర్లైన్స్ సంస్థ స్పైస్ జెట్.. తొలిసారిగా విమాన ప్రయాణికులకు గాల్లోనే యోగా క్లాసులు నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం పుణ్యామని ఒక్కొక్కరికి ఒక్కో రకం ఐడియాలు వస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే ఎయిర్లైన్స్ సంస్థ స్పైస్ జెట్.. తొలిసారిగా విమాన ప్రయాణికులకు గాల్లోనే యోగా క్లాసులు నిర్వహిస్తోంది. '35 వేల అడుగుల ఎత్తున హై ఆన్ యోగా' అనే పేరుతో స్పైస్ జెట్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.
ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు కొన్ని ఎంపిక చేసిన విమానాల్లో మాత్రమే ఈ ప్రత్యేక క్లాసులు ఉంటాయట. విమానం గాల్లో ఎగిరేటప్పుడు అక్కడే యోగా క్లాసులు పెడుతున్న మొట్టమొదటి సంస్థ ప్రపంచంలో తమదేనని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో యోగాను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న ఈ కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములం అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.