ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకుల్లో రుణాల ఎగవేత కేసులు, ఆర్థిక మోసాలు పెరుగుతున్న క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ 50 కోట్ల పైబడిన రాని బాకీలపై దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ కోరింది. రుణాలు తీసుకున్న వారు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినట్టు గమనిస్తే దర్యాప్తు ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్ బ్యాంకర్లకు సూచించారు.
బ్యాంకు మోసాలు, ఉద్దేశపూరిత ఎగవేతలను ఎప్పటికప్పుడు గుర్తించి..ఆయా కేసులను సీబీఐకి నివేదించాలని కోరారు. నిరర్థక ఆస్తులుగా మారిన ఖాతాలకు సంబంధించి సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి బ్యాంకులు రుణగ్రహాత స్టేటస్ రిపోర్టును పొందాలని సూచించారు. మరోవైపు నిర్వహణ సవాళ్లు, సాంకేతిక రిస్క్‌లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు 15 రోజుల్లోగా బ్లూప్రింట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఎస్‌యూ బ్యాంకులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment