
ముంబై : గ్లోబల్ స్లోడౌన్‌పై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఆర్థిక మందగమనం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. వడ్డీ రేట్లను భవిష్యత్‌లో తగ్గించబోమనే ఫెడ్ సంకేతాలూ ఆందోళన రేకెత్తించాయి. పలు రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు కోల్పోయి 37,267 పాయిట్ల వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 11,054 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment