సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుసగా నష్టాలకు ఆరంభంలోనే చెక్ చెప్పిన కీలక సూచీలు ముగింపు దాకా లాభాలను నిలబెట్టుకున్నాయి. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ఆఖరి గంటలో లాభాలను కోల్పోయినా, చివరికి 237 పాయింట్ల లాభంతో 41216 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు ఎగిసి 12108 వద్ద ముగిసింది. నిఫ్టీ 12100కి ఎగువన ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. నెస్లే, భారతి ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ నష‍్టపోగా, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, మారుతి సుజుకి తోపాటు గెయిల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్‌ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్ పవర్ గ్రిడ్, హిందాల్కో లాభాలు మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment