తయారీ రంగం జోరు.. | The manufacturing sector initiative | Sakshi
Sakshi News home page

తయారీ రంగం జోరు..

Published Wed, Aug 12 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

తయారీ రంగం జోరు..

తయారీ రంగం జోరు..

జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతం
♦ నాలుగు నెలల గరిష్ట స్థాయి
♦ తయారీ, వినియోగ వస్తువుల విభాగం దన్ను
♦ మిగిలిన పరిశ్రమలు అన్నీ నిరాశే!
 
 న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) జూన్‌లో ఫర్వాలేదనిపించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతంగా నమోదయ్యింది. గడచిన 4 నెలల్లో ఈ స్థాయిలో ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకాలేదు. తయారీ రంగం పురోగతి మొత్తం సూచీపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. అయితే మిగిలిన రంగాలు పెద్దగా పురోగతి సాధించకపోవడం గమనార్హం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) బుధవారం విడుదల చేసిన  గణాంకాల ప్రకారం...

తయారీ : మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం ఉత్పత్తి 2014 జూన్ నెలతో పోల్చితే 2015 జూన్‌లో 4.6 శాతం ఎగసింది. 2014 జూన్ నెలలో ఈ రేటు 2.9 శాతం. కాగా  ఈ విభాగంలోని మొత్తం 22 రంగాల్లో 16 సానుకూల ఫలితాలను అందజేశాయి
 మైనింగ్ : ఈ రంగంలో వృద్ధి అసలు లేకపోగా, - 0.3 శాతం క్షీణించింది. గత ఏడాది జూన్‌లో ఈ రేటు 4.8 శాతం
 విద్యుత్ : వృద్ధి రేటు 15.7 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది.
 క్యాపిటల్ గూడ్స్ :  డిమాండ్, పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల తయారీకి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా -3.6 శాతం క్షీణించింది. 2014 జూన్‌లో ఈ రంగం వృద్ధి రేటు 23.3 శాతం.
 వినియోగ వస్తువులు : ఉత్పత్తి క్షీణ బాట నుంచి వృద్ధికి మారింది. -8.8 శాతం క్షీణత నుంచి 6.6 శాతం వృద్ధికి ఎగసింది.

 త్రైమాసికంగా చూస్తే...
 క్యూ1లో ఐఐపీ 4.5% నుంచి 3.2%కి తగ్గింది. విభాగాల వారీగా చూస్తే... తయారీ రంగం వృద్ధి రేటు 3.9% నుంచి 3.6 శాతానికి పడింది. మైనిం గ్‌లో ఈ రేటు 2.9 శాతం నుంచి 0.7 శాతానికి పడింది. విద్యుత్ ఉత్పత్తి 11.3%నుంచి 2.3 శాతానికి దిగింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 13.7% నుంచి 1.5%కి పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement