ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన క్రమంగా పెరుగుతుండడం ఆయా సంస్థలకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతోంది. దీంతో రానున్న మూడేళ్లలో ఇన్వెస్టర్ల సంఖ్య రెట్టింపు అవుతుందన్న అంచనాతో ఉన్నాయి. ఇన్వెస్టర్ ఫోలియోల సంఖ్య గత ఐదేళ్లలో పెరిగింది చాలా స్వల్పమే. 4.7 కోట్ల నుంచి 5.3 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఇన్వెస్టర్లలో అవగాహన కోసం మ్యూచువల్ ఫండ్ డే పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటువంటి చర్యల ఫలితంగా రానున్న మూడేళ్లలో ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని సంస్థ ఈడీ సందీప్ సిక్కా చెప్పారు. ఫండ్‌ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 2007లో రూ.3.5 లక్షల కోట్లు కాగా, అది ప్రస్తుతం రూ.18 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.
మూడేళ్లలో రెట్టింపునకు ఫండ్స్ క్లయింట్లు!
Published Mon, Mar 13 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
Advertisement
Advertisement